![]() |
![]() |

బుల్లితెర మీద యాంకర్ సౌమ్య రావు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆదితో జోడిగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే సౌమ్య తెలుగు మీద ఆది చేసే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి సౌమ్య ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది. " ఇండస్ట్రీల హార్డ్ వర్క్ ఎం పనికి రాదురా..లక్కే ఇంపార్టెంట్. ఈ ఫీల్డ్ లో ఉన్నవాళ్లందరికీ నిజంగానే టాలెంట్ ఉందా ?. కొంతమంది లక్కు వలన వస్తే , కొందరు గిమ్మిక్స్ చేసి వచ్చారు, వస్తూనే ఉన్నారు. లాస్ట్ టైం ఉదయభాను గారు ఒక మాట అన్నారు ఇక్కడ సిండికేట్ జరుగుతుంది అన్నారు. అది నూటికి నూరు శాతం ఈ ఫీల్డ్ లో ఉంది. నేను కూడా ఫేస్ చేసాను. నేను ఒక సీరియల్ చేస్తున్నప్పుడు ఒక హీరోయిన్ ఆ హీరో మధ్య ఏదో పర్సనల్ గా ఉండేది. షూటింగ్ అంతా ప్యాకప్ ఐపోయాక ఆ అబ్బాయి వచ్చి నాకు చెప్తున్నప్పుడు ఆ హీరోయిన్ కార్ ని రివర్స్ గేర్ వేసి వేసి వచ్చి నన్ను గుద్దేసింది.. నాకు అదో హారిబుల్ ఎక్స్పీరియన్స్ అయ్యింది.
ఇండస్ట్రీ నాకు ఇచ్చినదాని కన్నా నేను పోగొట్టుకున్నది ఎక్కువ. ఒక రోజు నేను ఒక పెద్ద హీరోని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాలి. ఫాస్ట్ గా వెళ్తున్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయ్యింది. కాలు మొత్తం బ్లడ్. అక్కడి నుంచి నేను లేచి మళ్ళీ ఇంటర్వ్యూ ప్లేస్ కి వెళ్ళిపోయాను. చాలా కష్టాలు పడ్డాను. దేవుడు కనిపిస్తే మా అమ్మకు అలాంటి రోగం లేదు అనే రిపోర్ట్ రావాలని కోరుకుంటా అప్పుడు మా అమ్మ ఇంకా బాగుండేది నాతో ఉండేది కదా అనుకుంటా. మా అమ్మకు ఎం చెప్తాను. నాకు ఆమె అన్నీ.. నాకు ఇప్పుడు జ్ఞాపకంగా మిగిలిపోయింది." అంటూ బాధపడుతూ చెప్పింది సౌమ్య.
![]() |
![]() |